Wednesday, January 22, 2025

ఖర్గేనా.. థరూరా?

- Advertisement -
- Advertisement -

ఓటు హక్కు వినియోగించుకోనున్న 9వేల మందికి పైగా ప్రతినిధులు
బళ్లారిలో ఓటెయ్యనున్న రాహుల్ గాంధీ 
రాష్ట్రం నుంచి పాల్గొననున్న 238మంది ప్రతినిధులు… ఎల్లుండి ఫలితం వెల్లడి

న్యూఢిల్లీ: చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్‌లో గాం ధీయేతర వ్యక్తులతో అతీతంగా అధ్యక్ష స్థానానికి ఎన్నిక జరుగుతుంది. సోమవారం (17వతేదీ) అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కీలక సారధ్య స్థా నం అయిన పార్టీ అధ్యక్ష స్థానానికి డెలిగేట్ల స్థా యి ఓటర్లతో ఎన్నిక జరుగుతుంది. ఇప్పుడు భార త్ జోడో యాత్రలో కర్నాటకలో ఉన్న పార్టీ నాయకులు రాహుల్ గాంధీ బళ్లారి నుంచి ఓటేస్తారు. సోమవారం నాటి ఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పా ట్లు జరిగాయి. బరిలో ఇద్దరు సీనియర్లు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో 24ఏళ్ల తరువాత గాంధీయేతర వ్యక్తికి పార్టీ పట్టం కట్టేందుకు రంగం సిద్ధమైంది. ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పోలింగ్ ఉంటుంది. డెలిగేట్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో తమ ముందుకు వచ్చే బ్యాలెట్ పత్రంపై నచ్చిన వ్యక్తికి టిక్ మార్కు పెట్టాల్సి ఉంటుందని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథార్టీ ఛైర్మన్ మదుసూధన్ మిస్త్రీ ఆదివారం తెలిపారు. ఫలితాన్ని 19న ప్రకటిస్తారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయని వివరించారు. 9,000 మంది పిసిసి డెలిగేట్లతో ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు అయింది. ఈ సభ్యులు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటేసి తమ నేతను ఎంచుకుంటారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయం, దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుంది. 137 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ జరగడం ఇది ఆరవసారి. ఈ సారి ఎన్నికలలో సీనియర్ నేత, కర్నాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గేనే పార్టీ అనధికారిక అభ్యర్థి అని, ఆయన ఎన్నిక ఖాయం అని, పిసిసిల నుంచి వెలువడ్డ స్పందన చివరికి పోటీదారు థరూర్ వ్యాఖ్యానాలతోనే స్పష్టం అయింది. తాను మార్పును అభిలషించే వ్యక్తిగా పోటీకి దిగానని తిరువనంతపురం ఎంపి థరూర్ చెపుతూ వచ్చారు.
ఢిల్లీలో ఓటేసే ప్రియాంక, సోనియా
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ తమ ఓటును ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో వినియోగించుకుంటారని భావిస్తున్నారు. పర్యటనలో ఉన్న రాహుల్‌కు ఇక్కడ ఓటేసే అవకాశం లేదు. ఎప్పటిలాగానే ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఉందని సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. పార్టీలో ఇటువంటి కీలక పదవులకు ఏకాభిప్రాయం కీలకమని తాను విశ్వసిస్తానని చెప్పారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ ఎంచుకున్న విధానం ఏకాభిప్రాయసాధనే అని తెలిపారు. కామరాజ్ హయాం నుంచి కూడా ఇదే పద్ధతి ఉందని, ఇప్పటి నేపథ్యంలో పార్టీలో సామరస్యం మరింత అవసరం అని వ్యాఖ్యానించారు. వ్యవస్థాగత ఎన్నికలు నిజానికి పార్టీని ఏ విధంగా అయినా బలోపేతం చేస్తాయని తాను అనుకోవడం లేదని, ఇటువంటి పోటీ వ్యక్తుల ఇమేజ్ బలోపేతానికి ఉపయోగపడుతాయని, అయితే సమిష్టిత్వం స్ఫూర్తి ఇనుమడిస్తుందని తాను అనుకోవడం లేదని అన్నారు. ఏది ఏమైనా ఎన్నిక నెలకొంది కాబట్టి, వీటికి సహజంగానే ప్రాధాన్యత ఉంటుందని వివరించారు.
ఎన్నిక కన్నా భారత్ జోడో యాత్ర కీలకం: జైరాం
తనకు సంబంధించి ఈ వ్యవస్థాగత ఎన్నిక కేవలం అప్రాధాన్యత కిందికి వస్తుంది. దీని కన్నా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రధానమైనది. జోడో యాత్ర చారిత్రకం. కాంగ్రెస్‌కు, దేశ రాజకీయాలకు కూడా ఇది పరివర్తన క్రమపు పరిణామం అవుతుందన్నారు. ఇప్పటి పరిస్థితులలో పార్టీని బలోపేతం చేసే దిశలో జరిగే ప్రతి అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ కోణంలో చూస్తే ఇప్పటి ఎన్నిక ప్రస్తుత అంశం. అయితే భారత్ జోడో యాత్ర అత్యంతకీలక విషయం అన్నారు. ఈసారి అధ్యక్ష పదవికి పోటీ ప్రచారం దశలో ఇరువురు నేతలు ఖర్గే, థరూర్‌లు పార్టీని ముందుకు తీసుకుపోవడం, 2024 లోక్‌సభ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం చేయడంపై దృష్టి సారించి మాట్లాడారు. ప్రచార దశలో పలు రాష్ట్రాలలో ఖర్గేకు పిసిసి అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సీనియర్ నేతలు స్వాగతం పలికి , ప్రచార సరళిని సునాయాసం చేశారు. వీరిలో అత్యధికులు వృద్ధ నేతలు వారి అనుచరులు ఉన్నారు. అయితే థరూర్‌కు ఎక్కువగా యువ నేతలు, కాంగ్రెస్‌లోని మహిళా కార్యకర్తలు ప్రాధాన్యత ఇచ్చారు. తనకు పార్టీ వర్గాల నుంచి సరైన ఆదరణ దక్కలేదని, ఈ విధంగా తన బలానికి గండి ఏర్పడిందని తెలిపిన థరూర్ , ఖర్గేతో తమ పోటీ స్నేహపూరితమే అన్నారు. ఇక ప్రచార దశలో తనకు డెలిగేట్ల సమగ్ర సమాచారం అందలేదని, ఓటర్లను తాను వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చిందని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్న 238 ప్రతినిధులు
ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రదేశ్ రిటర్నింగ్ అధికారి రాజ్ మోహన్ ఉన్నతన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజ్ భగేల్‌ల ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణ నుండి ఓటు హక్కును పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు 238 డెలిగెట్స్ వినియోగించుకోనున్నారు. ఎఐసిసి అధ్యక్ష బరిలో మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ ఉన్నారు. ఎఐసిసి ఎన్నికలకు ఎపి కాంగ్రెస్ డెలిగేట్ల పోలింగ్ వ్యవహారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు 350 మంది పిసిసి డెలిగేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కర్నూలు జిల్లా రాజకీయ చరిత్రలో ఇది మరో అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టనుంది.

Congress President Elections Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News