Monday, January 20, 2025

మోడీ విష సర్పంలాంటి వ్యక్తి : మల్లికార్జున్ ఖర్గే

- Advertisement -
- Advertisement -
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. విష సర్పం వంటి వ్యక్తి అనేసి తర్వాత అన్న మాటని వెనక్కి తీసుకుని మాట మార్చేశారు.

కల్‌బుర్గి(కర్నాటక): కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కర్నాటకకు చెందిన గదగ్ వద్ద ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని మోడీ విష సర్పంలాంటి వ్యక్తి. దేశాన్ని ఆయన నాశనం చేశారన్నారు. ‘ప్రధాని మంచోడనుకుని మీరో అవకాశం ఇచ్చి చూద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు దాని విషాన్ని చవిచూస్తున్నారు. అందుకనే మీరెల్లప్పుడూ దేశం గురించే ఆలోచించండి’ అని ఖర్గే ర్యాలీలో ప్రసంగిస్తూ చెప్పారు. ఖర్గే జడుసుకున్నారేమో కొన్ని గంటల తర్వాత తన మాటని వెనక్కి తీసుకున్నారు. ‘నా ఉద్దేశ్యంలో బిజెపి భావజాలం పాము వంటిది’ అని మాట మార్చారు. ‘నేను వ్యక్తిగతంగా మోడీని అలా అనలేదు. నేను చెప్పిందంతా భావజాలం పాము వంటిదని అని… మీరు పామును ముట్టుకోవాలని ప్రయత్నిస్తే చస్తారు’ అని చెప్పుకొచ్చారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News