కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే చేతిలో శశిథరూర్ భారీ మెజార్టీతో ఓటమిపాలయ్యారు. ఈనేథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని, పోలైన ఓట్లు చెల్లనివిగా పరిగణించాలని పార్టీ ఎన్నికల సంఘానికి థరూర్ లేఖ రాశారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పోలింగ్ రోజు తెలంగాణలోనూ తీవ్రమైన సమస్యలు తలెత్తాయని థరూర్ బృందం ఇసికి లేఖ రాసింది. థరూర్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సల్మాన్ సోజ్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల అథార్టీ విచారణ జరుపుతామని ఇచ్చిందని ట్వీటర్ వేదికగా తెలిపారు. కాగా సోజ్ ఇసికి రాసిన లేఖ లీక్ అవడంపై థరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయం అవడం దురదృష్టకరమని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీ బలోపేతానికి జరిగాయని, విడదీయడానికి కాదని కేరళ ఎంపి థరూర్ వ్యాఖ్యానించారు.
Congress Presidential polls: Shashi Tharoor complaint EC