Thursday, January 9, 2025

కాంగ్రెస్‌ ఆందోళనలు.. కాంగ్రెస్ నేత సునీతారావు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత కామెంట్స్ కాంగ్రెస్ భగ్గుమంది. రాహుల్‌ను ఉగ్రవాదిగా నిందిస్తూ బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. యూత్‌ కాంగ్రెస్ కార్యాలయం దగ్గర మోడీ దిష్టిబొమ్మకు కార్యకర్తలు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు.

బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందు సిద్ధమైన కాంగ్రెస్ కార్యకర్తలను బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. ఇక, హైదరాబాద్ లోనూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు నాంపల్లి బీజేపీ కార్యాలయం ఎదుట బైటాయించి మహిళా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇక, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కూడా పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News