Saturday, April 19, 2025

ఈడీతో రాహుల్‌ గాంధీని ఇబ్బందిపెట్టే ప్రయత్నం: మంత్రి శ్రీధర్

- Advertisement -
- Advertisement -

మోడీ ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్ బాబు ఫైరయ్యారు. ఈడీని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలన కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ వేసిన చార్జీషీట్ కు నిరసనగా గురువారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఇందులో పార్టీ నాయకులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగినట్లు ఆరోపిస్తున్నారని.. విదేశీ లావాదేవీలు జరగనప్పుడు మనీలాండరింగ్‌ ప్రసక్తే లేదని అన్నారు. బిజెపి నిరంకుశ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామన్ంనారు. సంస్థకు రూ.90 కోట్లకు పైగా అప్పులున్నా.. ప్రజా గొంతుకగా ఉండాలని పత్రికను నడిపారని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకత్వానికి ఈడీ ద్వారా సమన్లు పంపుతున్నారని.. రాహుల్‌గాంధీని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. బిజెపి ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతోందిన ధ్యజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News