Monday, December 23, 2024

25న జంతర్‌మంతర్‌లో దీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలో చేపట్టే ప్రదర్శనకు ఉపాధిహామీ సిబ్బంది తరలిరావాలని అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల కాంగ్రెస్ (కెకెసి) పిలుపునిచ్చింది. కెకెసి రాష్ట్ర చైర్మన్ -దేవునూరి లక్ష్మణ్ యాదవ్, డాక్టర్ ఉదిత్ రాజ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి నిధులు, పనిదినాలు పెంచాలని కోరుతూ ఈ నెల 25వ తేదీ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఉదయం 11 గంటలకు ఉపాధిహామీ కాపాడాలి – గ్రామీణ భారతదేశాన్ని కాపాడాలి పేరిట ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో అసంఘటిత కార్మిక కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల ఉపాధిని కల్పించింది.

నేడు, సగటున, 25 -30 రోజుల ఉపాధి ఇస్తున్నారు. పని చేసిన ఉపాధి కూలీలకు ఇప్పటికి బకాయిలు చెల్లించడం లేదు.ఉపాధి హామీ గ్రామీణ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిరూపించబడింది. మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రూ. 2-2.5 లక్షల కోట్ల బెయిల్- అవుట్ పథకం కింద రుణాలను మాఫీ చేయడం ద్వారా కొన్ని కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుండగా.. బడ్జెట్‌లో మాత్రం ఉపాధి హామీకి వేల కోట్లల్లోనే నిధులను కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. ఉపాధిహామీ పథకం పరిరక్షణకే ఢిల్లీలో ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News