Monday, December 23, 2024

యువజన కాంగ్రెస్ నాయకుడిపై దాడికి నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/మోత్కూరు: టిపిసిసి అద్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా వరంగల్ వెస్టు ఎమ్మెల్యే అక్రమాలపై చార్జిషీట్ విడుదల చేసి ప్రజలకు తెలియజేసిన యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై ఎమ్మెల్యే అనుచరుల దాడిని నిరసిస్తూ మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షుడు గుండగోని రామచంద్రుగౌడ్ మాట్లాడుతూ…. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దాడులు చేస్తూ బయపెట్టాలని చూస్తే ప్రజా స్వామ్యంలో ప్రజలు చూస్తూ ఊరుకోరని, సమయం వచ్చనప్పుడు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. దాడికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మలిపెద్ది మల్లారెడ్డి, నాయకులు కారుపోతుల శ్రీనివాస్, డాక్టర్ అంజయ్య, నిమ్మల శ్రీను, ఎండి.సమీర్, అన్నెపు నర్సింహ్మ, బందెల రవి, కోల శ్రీనివాస్, పురుగుల యాదగిరి, గొలుసుల సోమయ్య, పల్లె భిక్షం, మల్లయ్య, తాల్లపల్లి స్వామి, కూరెల్ల యాదగిరి, కారుపోతుల యాకయ్య, ఎడ్ల భిక్షం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News