Monday, December 23, 2024

కూరగాయల ధరలపై కాంగ్రెస్ నిరసన

- Advertisement -
- Advertisement -

జనగామ : పెరిగిన కూరగాయల ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ పట్టణ కౌన్సిలర్ వంగాల కళ్యాణి, గుజ్జుల రజిని, బ్లాక్ మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు కాముని జయ, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు చందనరెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు కొయ్యడ శోభ, తాడగోని సుప్రియ, జిట్టబోయిన వెంకటలక్ష్మీ, బత్తోజు మహాలక్ష్మీ, పద్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసంపల్లి లింగాజీ, జక్కుల వేణుమాధవ్, మహేందర్‌రెడ్డి, లొక్కుంట్ల ప్రవీణ్, కట్ట కృష్ణ, కర్రె రాజశేఖర్, వేముల మల్లేష్, దేవర సత్యనారాయణ, శ్రీనివాస్, కాముని శ్రీనివాస్, కృష్ణ స్వామి, గడ్డమీది సురేష్, సంకటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News