Monday, December 23, 2024

అదానీ వ్యాపార మార్గం 100 శాతం నైతికమేనా: కాంగ్రెస్ ప్రశ్న

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల అక్రమాలపై మిండెన్‌బర్గ్ నివేదిక నివేదిక వెల్లడైన నేపథ్యంలో 2020లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన పాత ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ శనివారం మరోసారి గుర్తు చేస్తూ గౌతమ్ అదానీ వ్యాపార మార్గం ఏమిటో తెలుసుకునే హక్కు దేశ ప్రజాలకు ఉందని, అది 100 శాతం నైతికమేనా అంటూ ప్రశ్నించింది. ఈ ట్వీట్ మీకు గుర్తుందా అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తూ కొన్నేళ్లలోనే అదానీ తన ఆస్తులను ఎలా రెటింపు చేసుకోగలిగారన్నదే ముఖ్యమైన ప్రశ్నని పేర్కొంది. ఆయన వ్యాపార మార్గం ఏమిటని, అది 100 శాతం నైతికమేనా అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ విషయాలను తెలుసుకునే హక్కు భారత ప్రజలకు ఉందని కాంగ్రెస్ తన తాజా ట్వీట్‌లో స్పష్టం చేసింది.

2020లో 16.2 బిలియన్ డాలర్ల నికర ఆస్తులను సంపాదించుకుని ఎలాన్ మస్క్, జెఫ్ బేజోస్‌లను పక్కకు నెట్టి ప్రపం కుబేరుల జాబితాలో చోటు గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్న సందర్భంగా& 2020లో మీ సంపద ఎంత పెరిగిందంటూ రాహుల్ గాంధీ దేశ ప్రజలను ప్రశ్నించారు. మీరు బతుకు పోరాటం చేస్తుంటే ఆయన(గౌతమ్ అదాని) రూ 12 లక్షల కోట్లు సంపాదించాడు. తన సంపదను 50 శాతం పెంచుకున్నాడు. ఇది ఎలా సాధ్యమో మీరు చెప్పగలరా అంటూ రాహుల్ ప్రజలను అప్పట్లో ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News