Monday, December 23, 2024

సన్నీ డియోల్ విల్లా వేలంపై బ్యాంక్ ఆఫ్ బరోడా వెనుకడుగు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు, బిజెపి ఎంపి సన్నీ డియోల్‌కు చెందిన ముంబై బంగళాను వేలం వేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా ఉపసంహరించుకోవడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శించింది. రూ. 56 కోట్ల రుణ చెల్లింపులు ఎగవేసినందుకు ముంబైలోని జుహు ప్రాంతంలోగల సన్నీ డియోల్‌కు చెందిన విల్లాను వేలం వేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇదివరకు నోటీసు జారీచేసింది.

సోమవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఒక సోషల్ మీడియా పోస్టులో ఈ విషయమై బ్యాంక్ ఆఫ్ బరోడా చర్యను ప్రశ్నించారు. బిజెపి ఎంపి సన్నీ డియోల్ బ్యాంకుకు రూ. 56 కోట్ల రుణాన్ని బాకీ పడినందున ఆయనకు చెందిన జుహు బంగళాను ఇ ఆక్షన్ వేస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చిందని, అయితే 24 గంటలు కూడా గడవక ముందే సాంకేతిక కారణాలతో ఈ వేలంను ఉపసంహరిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించిందని ఆయన తెలిపారు. రూ. 56 కోట్ల బకాయిల వసూలు కోసం గదర్ 2 నటుడు సన్నీ డియోల్ బంగళాను సెప్టెంబర్ 25న వేలం వేస్తున్నట్లు బ్యాంక్ ఆప్ బరోడా శనివారం ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రకటన ఇచ్చింది.

అయితే సోమవారం మరో సవరణ నోటీసును ప్రకటిస్తూ సాంకేతిక కారణాల వల్ల ఈ వేలంను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అజయ్ సింగ్ అలియాస్ సన్నీ దియోల్‌కు చెందిన అంధేరీ తాలూకాలోని జుహు గ్రామంలోగల 899.44 చదరపు మీటర్ల విస్తర్ణీలోని బంగళాను ఇ వేలం వేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడో తెలిపింది. 19 ఆగస్టున ఇచ్చిన ఇ ఆక్షన్ అమ్మకం నోటీసును ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News