Wednesday, January 22, 2025

ఖమ్మం జన గర్జనకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: ఖమ్మంలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనే జనగర్జన సభకు ఆదివారం హసన్‌పర్తి మండల కేంద్రం 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివెళ్లారు. చలో ఖమ్మం జన గర్జన సభకు బయలుదేరిన వారిలో 66వ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎర్రగట్టు దేవస్థానం మాజీ ఛైర్మన్ జన్ను రవీందర్, ఆరెల్లి వెంకటస్వామి, దూడల ప్రకాష్, కొడాలి మురళి, జన్ను రమేశ్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్, 66వ డివిజన్ యూత్ అధ్యక్షుడు తాళ్ల మధు తదితరులు ఉన్నారు.
చెన్నారావుపేట: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని లింగాపురం సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు తప్పెట రమేశ్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరుగుతున్న తెలంగాణ జన గర్జన సభకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో లింగాపురం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. రాన్ను రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు దాటినా పేదోడికి న్యాయం జరగలేదన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు న్యాయం చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి, మాజీ సర్పంచ్ కుమారస్వామి, మాజీ సొసైటీ వైస్ ఛైర్మన్ దూడయ్య, చిన్న గురిజాల ఉపసర్పంచ్ కమలాకర్, మాజీ డైరెక్టర్ సూరయ్య, నాయకులు సూరయ్య, నరేందర్, రామ్మూర్తి, ఇంద్రయ్య, కర్ణాకర్, రవి, శంకర్, మల్లయ్య, శ్రీనివాస్, యాకయ్య, సతీష్, రాజ్‌కుమార్, రమేశ్, బాబు, కోటేశ్వర్, అఖిల్, వేణు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
గంగారంలో.. గంగారం మండలం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఖమ్మంలో జరిగే జన గర్జన సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా గంగారంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కాగా సభకు తరలిన వారిలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News