ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం పట్ల ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. ‘బిజెపి, దాని నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థలను పంజరాలుగా మార్చారని మేము చెబుతూనే ఉన్నాం. ఈ కారణంగానే ప్రస్తుత సిఎంలను జైలుకు పంపారు.
అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు (మధ్యంతర) బెయిల్ మంజూరు చేయడాన్ని హర్షిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది’ అని యాదవ్ అన్నారు. ‘మేము కూటమిలో ఉన్నాం. కూటమిలో రెండు పార్టీలు పరస్పరం సాయం చేసుకుంటాయి. వాటి పని చేస్తాయి. మొత్తం ఏడూ (లోక్‌సభ సీట్లు) మా బాధ్యత. సంయుక్త ప్రచారానికి ప్రయత్నిస్తాం. దీనికి ఇప్పుడు బలం చేకూరింది. ఈ నిర్ణయంతో బలిష్ఠమైంది’ అని యాదవ్ చెప్పారు.