Monday, December 23, 2024

ప్రధాని మెగా హామీల కోసమే..

- Advertisement -
- Advertisement -

Congress reacts on skips Gujarat election dates

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ వాయిదా
కాంగ్రెస్ ఆరోపణ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రానికి మరిన్ని మెగా హామీలు, ప్రారంభోత్సవాలు చేయడం కోసమే హిమాచల్‌ప్రదేశ్‌తో పాటుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించలేదని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆరోపించింది. ఎన్నికల సంఘం ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌కు మాత్రమే ఎన్నికల తేదీలను ప్రకటించడం చూశాక తమ పార్టీ పరిణామంపై ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు.‘ బహుశా ప్రధానమంత్రి మరికొన్ని హామీలు, ప్రారంభోత్సవాలు చేయడం కోసమే ఇలా చేసి ఉండవచ్చు. ది మాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు’ అని జైరాం రమేశ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News