Sunday, December 22, 2024

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 21 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం సమావేశమైంది. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి అజోయ్ కుమార్, జమ్తారా నుంచి ఇర్ఫాన్ అన్సారీ, పోరేయాహట్ నుంచి ప్రదీప్ యాదవ్, మాండూ నుంచి జై ప్రకాష్ పటేల్, జంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి బన్నా గుప్తా, లోహర్‌దాగా నుంచి రామేశ్వర్ ఓరాన్‌లను పార్టీ బరిలోకి దించింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను పరీక్షించేందుకు కాంగ్రెస్ ప్యానెల్ గత వారం 62 సీట్ల పేర్లను CEC పరిశీలన కోసం క్లియర్ చేసింది. నాందేడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉపఎన్నిక బరిలో వసంతరావు చవాన్ కుమారుడు రవీంద్ర చవాన్ దింపుతున్నట్లు పార్టీ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News