Monday, December 23, 2024

హర్యానాకు 40 మంది కాంగ్రెస్ స్టార్ క్యాంపేనర్లు

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల (అక్టోబర్)5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్న 40 మంది స్టార్ క్యాంపేనర్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, భూపీందర్ హూడా, కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు ఉన్నారు. రెజ్టింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు, బిజెపి మాజీ ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా

జ్లర్లు నిర్వహించిన నిరసనలో ముందుండి పోరాడిన వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారి పేర్లు కూడా స్టార్ కాంపేనర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. స్టార్ క్యాంపేనర్ల జాబితాలో ఇంకా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, పార్టీ హర్యానా వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపక్ బబారియా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉదయ్ భాన్, పార్టీ నాయకులు అజయ్ మారెన్, బీరేందర్ సింగ్, ఆనంద్ శర్మ, సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, చరణ్‌జిత్ సింగ్ చన్ని ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News