Wednesday, January 22, 2025

పాంచ్ న్యాయ్… పచ్చీస్ గ్యారంటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో కలిపిన 5 గ్రా మాలను మళ్లీ తెలంగాణలో కలుపుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడుతూ పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలో భాగంగా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టోలో ప్రధానంగా 23 అంశాలు చేర్చామని ఆయన తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలను అమలు చేస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. యువత కోసం వివిధ రకాల యూనివర్సిటీలు తీసుకొస్తామన్నారు.

ఐటి కారిడర్ పునరుద్ధరిస్తామని, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతి గడపకూ మేనిఫెస్టోను తీసుకెళ్లాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అవసరాలు ఆలోచించి మరీ మేనిఫెస్టో తయారుచేశామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని ఆయన ఆరోపించారు.

అన్నివర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశాం : దీపాదాస్ మున్షీ
అన్నివర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశారని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. ఈ కమిటీలో ఉన్న అందరికీ ఆమె అభినందనలు తెలిపారు. బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని, ఆ పార్టీ నేతల నినాదాలు చూసి ప్రజలు భయపడుతున్నారని ఆమె ఆరోపించారు. సీబిఐ, ఈడీ, ఐటి దాడులతో విపక్ష నేతలు ఆందోళనకు గురవుతున్నారని ఆమె విమర్శించారు. దేశ ప్రజలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టారని అన్నారు. దేశం బాగుండాలంటే రాహుల్ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారని దీపాదాస్ మున్షీ వెల్లడించారు.

అందరికీ న్యాయం జరిగేలా మేనిఫెస్టో : అంజన్ కుమార్ యాదవ్
యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఇప్పటివరకు ఐదు గ్యారంటీలు అమ లు చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి అన్నిరకాలుగా మేలు చేసేలా ఈ మేనిఫెస్టో ఉందని అజారుద్దీన్ తెలిపా రు. అన్నివర్గాల ప్రజలకు లబ్ధి జరిగేలా దీనిని తయారు చేశామన్నారు. కాంగ్రెస్ నేతలు మరో 8 రోజులపాటు కష్టపడి ప్రచారం చేయాలన్నారు. ఈ మేనిఫెస్టో రాష్ట్రానికి బంగారు భవిష్యత్‌ను ఇస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. దీనిని ప్రతి గడప దగ్గరికీ తీసుకెళ్లాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పిలుపినిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News