Wednesday, January 22, 2025

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు మూడో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు 43 అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదలచేశారు. బిజెపి మాజీ నాయకుడు, మాజీ ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడిని అథని అసెంబ్లీ స్థానం నుంచి నిలబెట్టింది. కోలార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పోటీకి దింపకుండా, కొత్తూరు జి. మంజునాథ్‌ను ఆ స్థానం నుంచి బరిలోకి దింపినట్లు జాబితా పేర్కొంది. కోలార్ అసెంబ్లీ స్థానం నుంచి (రెండో నియోజకవర్గంగా) ఆయన పోటీ చేయాలని కోరుకుంటున్నారు. గతంలో ఆయన కుమారుడు ప్రాతినిధ్యం వహించిన వరుణ నియోజకవర్గం నుంచి ఆయనను పార్టీ ఇప్పటికే బరిలోకి దింపింది.

కుమటా అసెంబ్లీ స్థానం నుంచి మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా కుమారుడు నివేదిత్ అల్వాను కూడా పార్టీ పోటీకి దింపింది. తొలి జాబితాలో 124 స్థానాలు, రెండో జాబితాలో మరో 42 స్థానాలు సహా ఇప్పటి వరకు 209 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన కాంగ్రెస్ ఇంకా 15 మంది అభ్యర్థుల స్థానాలను ప్రకటించాల్సి ఉంది.

మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ నిరాకరించడంతో బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సవాది శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. బెళగావి జిల్లాలో లింగాయత్ నాయకుడైన సవాడి ‘నేటి నుంచి నాకు బిజెపితో సంబంధంలేదు. నేను కాంగ్రెస్‌కు అంకితభావంతో పనిచేస్తాను. నేను బిజెపిలో 20 నుంచి 25 ఏళ్లు పనిచేశాను’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News