Friday, December 20, 2024

కాంగ్రెస్ 56 మంది అభ్యర్థులతో 3 వ జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ 56 మంది అభ్యర్థులతో మూడో జాబితా గురువారం విడుదల చేసింది. బెర్హంపూర్ నుంచి అధిర్ రంజన్ చౌదరి,కర్ణాటక లోని గుల్బర్గా నుంచి మల్లికార్జున్ ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ, సోలాపూర్ నుంచి మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితి షిండేను రంగం లోకి దింపింది. రాజస్థాన్ లోని సికార్ లోక్‌సభ స్థానాన్ని సిపిఎంకు విడిచిపెట్టింది. వీరందరితో కలిపి మొత్తం 138 మంది అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించింది. ఈ మూడో జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి రెండు స్థానాలకు , గుజరాత్ లోని 11, కర్ణాటక లోని 17,మహారాష్ట్ర లోని 7, రాజస్థాన్ నుంచి 5, తెలంగాణ నుంచి 5, పశ్చిమబెంగాల్ నుంచి 8, పుదుచ్చేరి నుంచి ఒకటి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

అరుణాచల్ వెస్ట్ నుంచి మాజీ సిఎం నబం టుకీ పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లో గాంధీ నగర్ నుంచి సోనా పటేల్, దాహోద్ (ఎస్‌టి) స్థానం నుంచి ప్రభాబెన్ తవియాద్, సూరత్ నుంచి నీలేష్ కుంబాని, పోటీకి దిగారు. కర్ణాటకలో చిక్కోడి నుంచి ప్రియాంక జర్కిహోలి, గుల్బర్గా (ఎస్‌సి) నుంచి రాధాక్రిష్ణ, ధార్వాడ్ నుంచి వినోద్ అసూటి, బెంగళూరు నార్త్ నుంచి ఎం. రాజీవ్ గౌడ, బెంగళూరు సౌత్ నుంచి సౌమ్య రెడ్డి, బెంగళూరు సెంట్రల్ నుంచి మన్సూర్ అలీ ఖాన్, పోటీలో ఉన్నారు. బెర్హంపూర్ నుంచి అధిర్ రంజన్ చౌదరిని మళ్లీ పోటీకి దింపింది. ఈ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత, రాజకీయ నేతగా మారిన క్రికెటర్ యూసఫ్ పఠాన్ పోటీ చేస్తున్నారు.

అదే విధంగా మల్దాహ దక్షిణ్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ అబూ హసీంఖాన్ ఉన్నప్పటికీ, అదే స్థానం నుంచి అబూ కుమారుడు ఇషాఖాన్ చౌదరిని కాంగ్రెస్ రంగం లోకి దింపింది. ఇంతకు ముందు ఏడవ దశకు సంబంధించి కాంగ్రెస్ 82 మంది అభ్యర్థులతో రెండు జాబితాలను ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News