Sunday, December 22, 2024

వెళ్లే వారి కన్నా చేరే వారే ఎక్కువ: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

కోచ్చి: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తేలికగా తీసుకుంది. జాతీయ రాజకీయ క్షేత్రంలో తమ పార్టీకి అత్యధిక ఆదరణ ఉందని, వివిధ రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో నాయకులు తమ పార్టీలో చేరికకు మీడియాలో చోటు దక్కడం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బుధవారం నాడిక్కడ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం హర్యానాలో 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని, ఇటువంటి తాజా పరిణామాలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని విచారం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో ఇటీవల చింతన్ శిబిర్ అనంతరం పలువురు నాయకులు కాంగ్రెస్‌ను వీడడంపై ప్రశ్నించగా స్వతంత్ర అభ్యర్థిగా యుపి నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కపిల్ సిబల్‌కు సమాజ్‌వాది పార్టీ మద్దతు తెలిపిందని చెప్పారు. సిబల్ తన రాజీనామా లేఖలో కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన అన్నారు. సిబల్ రాజీనామా ప్రభావం పార్టీపై ఏ విధంగా ఉంటుందన్న ప్రశ్నకు ఆయన జవాబివ్వడానికి నిరాకరించారు.

Congress Respond over Kapil Sibal’s Resign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News