కోనరావుపేట: కరెంట్ మీద కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని,వ్యసాయనికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చింది కేసీఆర్ అని కోనరావుపేట రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు గోగు ప్రతాపరెడ్డి అన్నాడు. మంగళవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ రైతు వేదికలో కేటీఆర్ పిలుపు మేరకు రైతులతో మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపీట వేసిందని అన్నాడు. సాగు,త్రాగు నీటి కొరతను తీర్చడానికి ప్రాజెక్తుల నిర్మాణం చేసిందని,అందులో భాగంగానే మల్కాపేట రిజర్వాయర్,ములవాగులోకి ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టు నింపడం జరువుతుందని దీనితో మండలంలో 30 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయని గుర్తు చేసాడు.
కాంగ్రెస్ హయంలో కరెంట్ కష్టాలు,పొలాలు ఎండిపోవడం, రాత్రి వేళల్లో కరెంట్ షాక్ కి ఎంతో మంది రైతులు బలయ్యరని గుర్తు చేశాడు. కేసిర్ స్వయంగా రైతు కాబట్టి రైతుల కష్టాలు తెలిసి వ్యసాయనికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తున్నడని అన్నాడు. దీనిపై కాంగ్రెస్ వాళ్లు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని, ఇలా చేస్తే గ్రామాల్లో వారిని రైతులు తిరగనియ్యారని అన్నారు.
కేసీఆర్ మీద రైతులకు,ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, రాబోయే రోజుల్లో మూడవసారి కేసీఆర్ ప్రభుత్వానికే పట్టం కడతారని,తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలు అబివృద్ది కోసం పని చేస్తుందని, అందరిని కడుపులో పెట్టుకొని కాపాడుకునే నాయకుడు మన ముఖ్యమంత్రి అని అన్నాడు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ ల ఫోరమ్ గోపు పర్సరాములు, బారాస మండల అధ్యక్షుడు మల్యాల.దేవయ్య,సర్పంచులు కేంద గంగాధర్, మంతెన సంతోష్, బారాస జిల్లా నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, అబ్బాసాని శంకర్ గౌడ్,మామిడి ప్రభాకర్ రెడ్డి, రవీందర్ గౌడ్,దయాకర్ రైతులు పాల్గొన్నారు.