Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీకి వయనాడ్ సీటు కూడా దక్కదు:  మోడీ

- Advertisement -
- Advertisement -

నాందేడ్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ సాహెబ్జాదే వయనాడ్ సీటును కూడా కోల్పోతారు.  ఆ తర్వాత ఆయన తనకు సురక్షితమైన సీటెక్కడ అని వెతుక్కుంటారు’’ అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. ఆయన నాందేడ్, హింగోలి సీట్ల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ఈ విషయం చెప్పారు. లోక్ సభ ఎన్నికలు ఎన్ డిఏ పక్షంలో ఏకపక్షంగా ఉండనున్నాయని అన్నారు.

ఇండియా బ్లాక్ లో ఉన్న నాయకులు (సోనియా గాంధీని ఉద్దేశించి) లోక్ సభ నుంచి రాజ్యసభకు జంపయ్యారని, వారికి పోటీ చేసే దమ్ము లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో చేసిన తప్పులను సరిచేయడంలోనే తన పదేళ్ల పాలన గడిచిందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మోడీ తెలిపారు. వ్యవసాయ సంక్షోభం అన్నది ఇప్పుడే ఏర్పడలేదని, అది కాంగ్రెస్ తప్పుడు విధానాల వల్లే ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియా బ్లాక్ ను కూడా విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News