Sunday, January 12, 2025

మోడీ స్వీయ వ్యామోహానికి అంతులేకుండా పోతోంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్‌ఆర్‌టిఎస్)కింద ప్రవేశపెట్టనున్న రైళ్లకు నమో భారత్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆయన స్వీయ వ్యామోహానికి అంతే లేకుండా పోతోందని వ్యాఖ్యానించింది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించే ర్యాపిడ్ ఎక్స్ రైళ్లకు ‘నమో భారత్’గా నామకరణం చేసినట్లు అధికార వర్గాల సమాచారం.

దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ ట్విట్టర్( ఎక్స్)లో స్పందిస్తూ‘ ‘నమో స్టేడియం తర్వాత ఇప్పుడు నమో రైళ్లు వస్తున్నాయి. నరేంద్ర మోడీ స్వీయ వ్యామోహానికి అంతే లేకుండా పోతోంది’ అని వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లోని క్రికెట్ స్టేడియంకు నరేంద్ర మోడీ పేరు పెట్టిన విషయం తెలిసిందే. మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మరో అడుగు ముందుకు వేసి ‘భారత్ అని పెట్టడం ఎందుకు? దేశం పేరునే ‘నమో’గా మార్చేసి దాన్నే అన్నిటికీ పెడితే సరిపోతుందిగా’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News