Friday, November 22, 2024

యోగా ప్రచారకులెవ్వరైనా ఘనులే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యోగాను పునరుద్ధరించి , ప్రాచుర్యంలోకి ఎవరు తీసుకువచ్చినా వారిని గుర్తించాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. మన ప్రభుత్వం ద్వారా యోగా ప్రక్రియకు ఆదరణ దక్కినా ప్రశంసలు పొందాల్సిందేనని ఈ ఎంపి ట్వీటు వెలువరించారు. ఓ వైపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కాంగ్రెస్ ఈ విషయంలో ప్రధమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను గుర్తు చేసుకుంటున్న దశలో ఈ కాంగ్రెస్ ఎంపి పరోక్షంగా ప్రధాని మోడీని యోగా విషయంలో కొనియాడారు. యోగాకు ఇప్పుడు ప్రాచుర్యం దక్కింది, దీని పాత అవస్థ నుంచి పునరుద్ధరణ దశకు చేరుకుంది.

చివరకు ఐక్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఖరారు చేసుకుని యోగాను ప్రపంచీకరణం చేసుకున్నామని, ఇందుకు బాధ్యత తీసుకున్న వారెవ్వరైనా చివరికి మన ప్రభుత్వం అయినా దీనికి ప్రశంసలు పొందాల్సిందేనని థరూర్ పేర్కొన్నారు. తొలి ప్రధాని నెహ్రూ తన జీవితంలో యోగాను ఆచరించారు. ఆయన ఈ ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించారు. చివరికి ఆయన జాతీయ విధానాల్లో దీనిని అంతర్భాగం చేశారని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నెహ్రూ యోగా చేయడం , శీర్షాసనం వేయడం వంటి ఫోటోలను జతపర్చింది. ఈ కాంగ్రెస్ ట్వీటును థరూర్ తన వ్యాఖ్యలతో జోడించారు. అవును ఎవరైతే యోగాకు ప్రాధాన్యత తీసుకువచ్చారో వారందరిని మనం పేరుపేరునా గుర్తుంచుకోవల్సిందే. ప్రభుత్వం, పిఎంఒ ఇండియా, విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ విధంగా అంతా ప్రశంసనీయులే అని ఈ మాటలగరాడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News