Monday, December 23, 2024

నితీశ్ కుమార్ మెగా ప్రతిపక్ష సమావేశానికి హాజరుకానున్న కాంగ్రెస్!

- Advertisement -
- Advertisement -
2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి జూన్ 12న పాట్నాలో ప్రతిపక్షాల మెగా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వదలచుకోని సారూప్య భావజాలం ఉన్న రాజకీయ పార్టీలు జూన్ 12న బీహార్‌లోని పాట్నాలో సమావేశం కానున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జీ జైరామ్ రమేశ్ గురువారం మధ్యాహ్నం రిపోర్టర్లకు తెలిపారు. ఈ కీలక మెగా ప్రతిపక్ష సమావేశానికి కాంగ్రెస్ కూడా హాజరవుతోంది.
ఈ సమావేశం వ్యూహాన్ని చర్చించేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలిసిన 10 రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి సమస్యలను వేర్వేరుగా చూడాలని వారు భావిస్తున్నట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

‘దేశం ఒక్కటవుతుంది. ప్రజాస్వామ్యాన్ని బలపరచంది అన్నదే మా సందేశం…ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి రాహుల్ గాంధీ, నేను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో చర్చించాము… ’ అని ఖర్గే సమావేశానంతరం ట్వీట్ చేశారు.
‘పాట్నాలో జూన్ 12న జరిగే సమావేశానికి మేము హాజరవుతాము. ఎవరిని పంపాలో నిర్ణయిస్తాము. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర నాయకులు హాజరవుతారని నేననుకుంటున్నాను. కానీ మేము సమావేశానంతరం నిర్ణయిస్తాము’ అని జైరామ్ రమేశ్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ‘ ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. మేమూ హాజరవుతున్నాము’ అని విలేకరులకు తెలిపారు. జార్ఖండ్‌లో జెఎంఎం, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ ఇది వరకే నిర్ణయించుకున్న కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నందున ఈ ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కాలేకపోవచ్చని తెలిపారు. జూన్ 12న ఆయన మెట్టూరు డ్యామ్ ఆవిష్కరణ వేడుకలకు ఆయన హాజరవుతున్నారు. సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని కూడా ఆయన కోరారు. కానీ అది కుదరలేదు. కానీ డిఎంకె పార్టీ తమ తరఫున ఎవరినైనా పంపి హాజరుకాగలదని తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యం కాబోతున్నాయి. అందుకు సమావేశాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మోడీ మూడోసారి ప్రధాని కాకుండా నిలువరించడానికి ప్రతిపక్షాలు శాయాశక్తులా ప్రయత్నించనున్నాయి. కానీ మోడీ వెనుక కార్పొరేటర్లు, ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు బలంగా పనిచేస్తున్నాయన్నది ఇక్కడ గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News