Monday, December 23, 2024

నీట్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరగాలి: ఖర్గే

- Advertisement -
- Advertisement -

నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలన్న తన డిమాండును కాంగ్రెస్ పార్టీ గురువారం పునరుద్ఘాటించింది. ఈ వివాదంపై ప్రజలలో నెలకొన్న ఆగ్రహం పార్లమెంట్‌లో కూడా ప్రతిధ్వినిస్తుందని ఆయన కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) డైరెక్టర్ జనరల్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఖరి బాధ్యతారాహిత్యంగా, కర్కశంగా ఉందని ఆయన ఆరోపించారు. గ్రేస్ మార్కులు ఒక్కటే నీట్ పరీక్షకు సంబంధించిన సమస్య కాదని, ప్రశ్నాపత్రాల రిగ్గింగ్, లీకేజీ, అవినీతి వంటివన్నీ ఉన్నాయని ఖర్గే తెలిపారు. మోడీ ప్రభుత్వ చర్యల కారణంగా నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భిష్యత్తు అగమ్యగోచరమైందని ఆయన చెప్పారు. పరీక్షా కేంద్రం, కోచింగ్ సెంటర్ రెండూ కుమ్మక్కయ్యాయని,డబ్బు చెల్లించి పేపర్ తీసుకో అన్న ఆట ఆడారని ఖర్గే ఆరోపించారు.

తన తప్పులకు ఎన్‌టిఎని బాధ్యురాలిగా చేసి మోడీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదని, నీట్ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ దర్యాప్తునకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షక దర్యాప్తున కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండు చేస్తుందని ఆయన తెలిపారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారికి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలని, ఒక ఏడాదిని వృథౠ చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న నీట్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని డిమాండు చేశారు. ఎన్‌టిఎ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగితే అది న్యాయంగా, నిష్పాక్షికంగా, సమగ్రంగా ఉంటుందని తాము నమ్మడం లేదని ఆయన చెప్పారు. ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్‌ను తొలగించాలని, 10వ తరగతి విద్యార్థులకు సలహాలు వ్వడానికి ఇష్టపడే ప్రధాని నరేంద్ర మోడీ నీట్ యుజి విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక వేదనను విస్మరించకూడదని గొగోయ్ అన్నారు.

నీట్ కుంభకోణాన్ని పట్టించుకోవడం మాని ప్రమాణ స్వీకారోత్సవాలు, విదేశీ పర్యటనలో ప్రధాని మోడీ తీరిక లేకుండా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. నీట్ కుంభకోణంపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి విద్యార్థులకు జవాబుదారుగా నిలబట్టగల సంఖ్యాబలం పార్లమెంట్‌లో ఇండియా కూటమికి ఉందని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నీట్ పరీక్ష వివాదాన్ని చేపట్టిన ఘనత తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకే దక్కుతుందని ఆయన చెప్పారు. జూన్ 4వ తేదీనే నీట్ ఫలితాలు ప్రకటించడం మిస్టరీగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. యావద్దేశం ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో నీట్ ఫలితాలు కూడా విడుదల చేయడం వెనుక ఏదో దురుద్దేశం ఉందని, జరిగిన కుంభకోణాన్ని దాచేందుకే ఎన్నికల ఫలితాల రోజున నీట్ ఫలితాలను ప్రకటించారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల కోసం తాము ఎదురుచూస్తున్నామని,

24 లక్షల మంది యువజనుల ఆగ్రహాన్ని పార్లమెంట్‌లో తాము మార్మోగిస్తామని గొగోయ్ చెప్పారు. నీట్ పరీక్షలో పేపర్ లీకేజి జిరిగినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చడమే ప్రభుత్వం అలవాటుగా మార్చుకుందని, ప్రధాని మోడీ మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తారని గొగోయ్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News