Monday, December 23, 2024

కాంగ్రెస్ సీనియర్ నేత కటీకల్ శంకరనారాయణన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Congress senior leader Kateekal Sankaranarayanan passed away

 

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత కటీకల్ శంకరనారాయణన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతోన్న ఆయన కేరళలోని పాలక్కాడ్‌లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శంకరనారాయణన్ మృతి పట్ల పలు రాష్ట్రాల గవర్నర్లు, సిఎంలు, కాంగ్రెస్ నేతలు సంతాపాలు తెలిపారు. కె.శంకరనారాయణన్‌.. మహారాష్ట్ర, నాగాలాండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కేరళ శాసనసభకు నాలుగు సార్లు ఎంఎల్ఎ గా ఎన్నికైన శంకరనారాయణన్ ఆ రాష్ట్ర ఆర్థిక, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలకు మంత్రిగానూ పనిచేశారు. శంకరనారాయణన్ మృతి పట్ల మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సహా రాజకీయ రంగాలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News