Tuesday, January 21, 2025

అధిష్టానం హెచ్చరికలు బేఖాతరు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ

Congress senior leaders meet in Ashok Hotel

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ సీనియర్లు హైదరాబాద్ అశోక్ హోటల్‌లో అనుకున్న విధంగానే ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశం నిర్వహించవద్దని కూడా పార్టీ నాయకత్వం సూచించింది. అయినా కూడా ఈ సమావేశాన్ని పార్టీ సీనియర్లు నిర్వహించారు. హైదరాబాద్‌లో సీనియర్ల సమావేశం గురించి తెలుసుకున్న ఎఐసిసి సెక్రటరీ బోస్ రాజు పార్టీ సీనియర్లకు ఫోన్ చేశారు. సమావేశం నిర్వహించొద్దని సూచించారు. ఈ సమావేశం నిర్వహిస్తే చర్యలు తప్పవని కూడా బోస్ రాజు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సీనియర్లు వి.హనుమంతరావు, మర్రిశశిధర్‌రెడ్డిలకు బోస్ రాజు ఫోన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

బోస్ రాజు హెచ్చరికలను పార్టీ సీనియర్లు పట్టించుకోలేదు. అశోక్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వి.హనుమంతరావు, మర్రిశశిధర్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. పార్టీలో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై నేతలు మండిపడ్డారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై సీనియర్లు చర్చించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఏం చర్యలు తీసుకోవాలనేదానిపై సీనియర్లు పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వాలని భావిస్తున్నారు. బోస్‌రాజు సమావేశం నిర్వహించొద్దని సూచించినా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

అంతేకాదు, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా నేతలు చర్చించారు. అయితే ఈ తరహా పరిస్థితి రాకుండా రాష్ట్రంలో ఏం చేయాలనే దానిపై కూడా చర్చించినట్లుగా సమాచారం. మరోవైపు రేవంత్‌రెడ్డి తీరుపై కూడా చర్చించారని తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎక్కువగా రేవంత్‌రెడ్డి తీరుని వ్యతిరేకించే నేతలు హాజరు కావడంపై అసమ్మతి సమావేశంగా ముద్రపడిందనే వాదనను మర్రిశశిధర్‌రెడ్డి తోసిపుచ్చారు. తాము మూడేళ్లుగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని కూడా శశిధర్‌రెడ్డి గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలిసి పరిస్థితులను వివరిస్తామని కూడా శశిధర్‌రెడ్డి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఈ సమావేశాలు చిత్రీకరించవద్దని కూడా శశిధర్‌రెడ్డి కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము తాపత్రయపడుతున్నామని ఆయన వివరించారు.

సీనియర్ల భేటీపై అద్దంకి దయాకర్ ఆగ్రహం

హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు సమావేశం కావడంపై పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సీరియస్ అయ్యారు. మంత్రి హరీష్‌రావుతో పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎందుకు సమావేశమయ్యారని ప్రశ్నించారు. హరీష్‌రావుతో కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేయాలని హనుమంతరావు చర్చించారా? అని దయాకర్ వ్యంగాస్త్రాలు సంధించారు. పార్టీలు రక్షించుకోవాలనే నేతలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబోరన్నారు. పార్టీ వేదికలపైనే తమ అభిప్రాయాలు చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News