Monday, March 3, 2025

మున్నూరు కాపు నేతల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ ?

- Advertisement -
- Advertisement -

తక్షణమే సమాధానం చెప్పాలని ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపి విహనుమంత రావు ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్టుగా తెలిసింది. ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమై సొంత ప్రభుత్వాన్ని తిట్టించడం ఏమిటని ఏఐసిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ప్రభుత్వం బిసి కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ విహెచ్, ఆదిశ్రీనివాస్, కేకేలపై ఏఐసిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏమిటని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ సైతం వారిని ప్రశ్నించినట్టుగా తెలిసింది. దీనిపై తక్షణమే సమాధానం చెప్పాలని వారిని ఆదేశించినట్టుగా సమాచారం.

కాంగ్రెస్ ప్రభుత్వం బిసి కులగణన చేపట్టి బిసిలకు దక్కాల్సిన రిజర్వేషన్లను కల్పిస్తామన్న హామీ ఇచ్చింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ స్వయంగా పార్టీలోని బిసి సామాజిక నేతలో భేటీ నిర్వహించి, కుల గణన ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది. దీంతోనే ఏకతాటిపైకి బిసి సామాజిక వర్గాలు, ఆయా కుల సంఘాలు సమావేశాలు నిర్వహించుకొని తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో యాదవ కుల సంఘం ప్రత్యేకించి మీటింగ్ ఏర్పాటు చేసుకొని, రాజకీయంగా తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టింది. తాజాగా మున్నూరు కాపు సంఘం నేతలు శనివారం ప్రత్యేకంగామాజీ పిసిసి చీఫ్, మాజీ ఎంపి వి.హనుమంతరావు నేతృత్వంలో ఆయన ఇంట్లోనే మున్నూరుకాపు నేతలంతా సమావేశం అయ్యారు. ఇందులో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి నుంచి కీలక నేతలు హాజరవ్వడంతో ఏఐసిసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News