Friday, January 17, 2025

మిత్రపక్షం శివసేనకు కాంగ్రెస్ షాక్

- Advertisement -
- Advertisement -

కుదరని సీట్ల పంపకం

ముంబై : మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన (ఉద్ధవ్ వర్గం)కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లలో పోటీ చేస్తామని శివసేన చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వాములైన శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపి సీట్ల పంపకం కోసం నేతలు సమావేశమై చర్చించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉద్ధవ్‌వర్గంలో తగినంత మంది అభ్యర్థులు లేకపోయినప్పటికీ 23 స్థానాలు కోరడం సరికాదని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ అభ్యంతరం లేవదీశారు.

సీట్లపై నేతలు విభేదాలు మానుకోవాలని పేర్కొన్నారు. ఈ సంక్షోభం తరువాత శివసేన నేతలు వెళ్లిపోయారని, వాళ్లకు అభ్యర్థుల కొరత ఉందని చెప్పారు. శివసేన, శరద్‌పవార్ ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తరువాత కాంగ్రెస్ ఒక్కటే మహారాష్ట్రలో స్థిరమైన ఓటు శాతంతో కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు సమావేశంలో తెలిపారు. పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ సిఎం , మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ పేర్కొన్నారు. ప్రతిపార్టీ ఎక్కువ సీట్ల వాటాను కోరుకుంటున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్టా శివసేన 23 సీట్లు డిమాండ్ చేయడం ఎక్కువేనని ఆయన అభిప్రాయ పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News