Thursday, December 26, 2024

కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలి

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించినట్లు ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. శనివారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి స్టేషన్ ఘన్‌పూర్ పరిస్థితులను విన్నవించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉందని, ఈసారి గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని, పార్టీ బలోపేతం కోసం తాను చేపట్టిన కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందని రేవంత్‌రెడ్డి అభినందించినట్లు తెలిపారు. యువకులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సినవసరం ఉందని, కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయడమే లక్షంగా ముందుకు సాగాలని సూచించారన్నారు.

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలే ఇతివృత్తంగా పోరాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేతి జైపాల్‌రెడ్డి, తూటి నర్సింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ సదయ్యగౌడ్, ముత్తిరెడ్డి అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News