Thursday, January 23, 2025

పిఎం రోజ్‌గార్ మేళ ఎన్నికల గారడీ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో విపరీతంగా ఉద్యోగాలు కల్పిస్తామని , కల్పించామని ప్రధాని మోడీ ఇప్పుడు లెక్కలు చెప్పడం కేవలం ఎన్నికల గిమ్మిక్క్ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇంతకాలం యువతకు ఉద్యోగాల గురించి ఎక్కడా మాట్లాడకుండా ఉన్న ప్రధానికి ఈ ఎన్నికల సంవత్సరం ఆగమనం దశలోనే వారు గుర్తుకు వచ్చారా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. ప్రధాని మోడీకి ఇప్పుడు ఎన్నికల జ్వరం పట్టుకుందని, దీనితో ఆయన స్వరం మారుతోందని తెలిపారు.

మోడీకి ఎన్నికల ఏడాది వేడిగాలి తగులుకుందని వ్యాఖ్యానించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని చేసిందేమిటని, ఆయన ఇప్పుడు రోజ్‌గార్ మేళాలను నిర్వహించడం మరో భారీ జుమ్లా అయిందని విమర్శించారు. ఎప్పుడో ప్రకటించి ఉన్న ఉద్యోగాలను ఇప్పటివరకూ భర్తీ చేయని స్థితిలో కేంద్రం ఉందని, ఇప్పుడు వీటికి నియామక పత్రాలను జారీ చేయడం ప్రజల పట్ల ప్రత్యేకించి యువత పట్ల దాడికి ఇంతకు మించి పగటిపూట దగాకు తార్కాణమని మోడీపై కాంగ్రెస్ నేత విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News