Thursday, December 19, 2024

గుప్త ధనం బిజెపి ఖాతాల్లోకి:కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

, ‘కుట్ర పన్ని’ పథకం ద్వారా గుప్త ధనాన్ని బిజెపి ఖాతాలలోకి మళ్లించిందని కాంగ్రెస్ ఆదివారం ఆరోపించింది. ఎన్నికల బాండ్ల ‘కుంభకోణానికి’ ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా జవాబుదారీ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఖాతాలను ఆదాయపు పన్ను అధికారులు స్తంభింపచేసిన తరువాత పార్టీపై అధికార పార్టీ ‘పన్ను ఉగ్రవాదానికి, సర్జికల్ దాడులకు’ పాల్పడిందని కూడా ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల సమయంలో ‘పూర్తిగా నిష్పాక్షికత, తటస్థత’ కొనసాగిస్తుందని, జనం తన నుంచి ఆశించినట్లుగా రాజ్యాంగ విధులు నిర్వర్తిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. జైరామ్ రమేష్ విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపి సుమారు రూ. 6900 కోట్లు సంపాదించిందని,

కాంగ్రెస్‌కు రూ. 1300 కోట్లు అందాయని వెల్లడైన తరువాత 2018లో ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం ప్రభుత్వం సాగించిన ‘అతిపెద్ద దోపిడీ కుంభకోణం’ అనిఆరోపించారు. సుదీర్ఘ ఎన్నికల కార్యక్రమం గురించి రమేష్ ప్రస్తావిస్తూ, ‘ప్రతి చోట ప్రచారం చేయడానికి ప్రధానికి వీలు కలిగేలా’ ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కనిపిస్తోందని అన్నారు. వోటర్ల అనుమానాలు నివృత్తిఅయ్యేలా చూసేందుకు వివిపాట్ స్లిప్‌లను నూరు శాతం లెక్కించాలన్న కాంగ్రెస్, ఇతర పార్టీల డిమాండ్‌ను రమేష్ పునరుద్ఘాటించారు. కాగితం బ్యాలట్ విధానాన్ని తిరిగి అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ కోరడం లేదని, కానీ, వోటర్ల కు తిరిగి నమ్మకం కలిగేలా వివిప్యాట్ స్లిప్‌లు నూరు శాతం లెక్కించాలని పార్టీ కోరుతున్నదని ఆయన వివరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర‘విజయవంతంగా’ పూర్తి అయిందని ఆయన తెలిపారు. న్యాయ్ యాత్ర 106 జిల్లాల మీదుగా, 6300 కిలో మీటర్ల మేర సాగిందని రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News