న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి ముందు మోడీపై కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కాబోయే ప్రధాని “నరేంద్ర విధ్వంసక కూటమికి నాయకుడు” అని ఎద్దేవా చేసింది. ఇది చట్టవిరుద్ధమని గత వివాదాలను ఉదహరిస్తూ విమర్శించింది. ఆయనకు అన్ని చట్టబద్ధత లేకపోయినా, నరేంద్ర విధ్వంస కూటమి (ఎన్‌డిఎ) నాయకుడిగా ఈ సాయంత్రం (ఆదివారం) ప్రమాణస్వీకారం చేయనున్నారని విమర్శించింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ…“మే 28, 2023 గుర్తుందా? నరేంద్రమోడీ సింగోల్‌తో కొత్త పార్లమెంట్ భవనం లోకి అడుగుపెట్టిన రోజు. దీనికోసం ఆగస్టు 15, 1947 చరిత్ర సృష్టించబడింది. మోడీ సామ్రాట్‌గా వ్యవహరించడాన్ని సమర్థించడమే కాదు, తమిళ ఓటర్లకు విజ్ఞప్తి చేయడానికి కూడా, ఆరోజే నేను ఆర్కైవల్ మెటీరియల్‌ని ఉపయోగించి మోడీ నకిలీని బయటపెట్టాను ” అని ఆయన విమర్శించారు. “ఆ నాటకం ఫలితం ఇప్పుడు మాకు తెలుసు. సింగోల్ తమిళ చరిత్రకు గౌరవ ప్రదమైన చిహ్నంగా మిగిలిపోయింది. అయితే తమిళ ఓటర్లు, వాస్తవానికి భారత దేశ ఓటర్లు మోడీ వేషాలను తిరస్కరించారు ” అని రమేష్ వ్యాఖ్యానించారు.