Monday, January 20, 2025

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యోగి బుల్‌డోజర్: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

బుల్‌డోజర్లను ఎక్కడ ఉపయోగించాలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుంచి చేర్చుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి బుల్‌డోజర్ దళితులు, గిరిజనులు, బెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు వ్యతిరేకమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. యగి ఆదిత్యనాథ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఒక వ్యాసాన్ని కాగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉటంకిస్తూ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తుందని తెలిపారు. బుల్‌డోజర్‌ను ఎక్కడ నడిపించాలో యోగి ఆదిత్యనాథ్ నుంచి ఇండియా కూటమి నేర్చుకోవాలని ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్న మ్రోడీ నేడు వ్యాఖ్యానించారని, దళితులు, గిరిజనులు,

వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల విధానానికి యోగి బుల్‌డోజర్ ఎంత వ్యతిరేకమో చూడండి అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో జైరాం పోస్టు చేశారు. రిజర్వేషన్లపై యోగి అభిప్రాయాల కారణంగానే తాను ఆయనను సమర్థిస్తున్నానని ప్రధాని స్పష్టంగా చెప్పాలని జైరాం డిమాండ్ చేశారు. 400కి మించి సీట్లు ఇవ్వాలంటూ మోడీ కోరడం వెనుక ఉన్న ఉహస్యం ఇదేనని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌లో 400 సీట్ల మెజారిటీ ఉంటే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని సవరించి దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ హక్కును లాగివేయవచ్చని జైరాం రమేష్ ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంతం చేసి మనువాది ఆలోయన ఆధారంగా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలన్న ఆర్‌ఎస్‌ఎస్ దశాబ్దాల కుట్రను అమలు చేయాలని బిజెపి భావిస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News