Wednesday, July 3, 2024

మన్ కీ బాత్‌లో ప్రజల సమస్యల ప్రస్తావన ఏదీ?: మోడీని నిలదీసిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ప్రజలు వినాలని కోరుకున్న అంశాలు వేటినీ ఆయన ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆదివారం ఆరోపించారు. మోడీ మూడవ విడత ప్రధాని పదవిని చేపట్టిన అనంతరం మన్ కీ బాత్ తొలి ఎపిపోడ్ గురించి కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి ఖేరా విమర్శిస్తూ, నీట్, రైల్వే ప్రమాదం లేదా ‘మౌలిక వసతులు కూలిపోవడాలు’ గురించి ఆయన ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

ఇది మోడీ మూడవ విడత అయినప్పటికీ ఇది ఆయన సొంత బలంపై కాదని ఖేరా అన్నారు. ‘ప్రభుత్వం ఊతకర్రల సాయంతో నడుస్తోంది. ఆయన ఈ సారి అర్థవంతమైనది ఏమైనా మాట్లాడతారేమోనని భావించాం’ అని ఖేరా తెలిపారు. ‘నీట్‌పై గాని, రైల్వే ప్రమాదంపై గాని, మనం రోజూ వింటున్న మౌలిక వసతులు కూలిపోవడాల గురించి గాని ఆయన ఏమీ మాట్లాడలేదు’ అని ఖేరా విమర్శించారు.

‘ఢిల్లీ విమానాశ్రయంలో ఒక వ్యక్తి మరణానికి దారి తీసిన తీవ్ర ఘటనపై ఆయన మాట్లాడలేదు’ అని ఖేరా అన్నారు. ప్రజలకు సంబంధించిన ఏ అంశంపైనైనా ప్రధాని మాట్లాడలేదు అని ఆయన ఆరోపించారు. ‘ప్రధాని పద్ధతి అజెండాను మార్చడానికే. ప్రతి ఒక్కరూ నీట్, కుంభకోణాలు గురించి మాట్లాడుతున్న కారణంగా ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన కేరళ రూపొందిన గొడుగు గురించి మాట్లాడారు’ అని ఖేరా ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News