Thursday, December 19, 2024

కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది: లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని బిజెపి ఎంపి లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. బిజెపిపై బురద జల్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని, ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, సిఎం స్థాయికి తగినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం లేదని చురకలంటించారు. బిజెపి రిజర్వేషన్లకు అనుకూలమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. రాజ్యాంగం పట్ల తనకెంత ప్రేమ ఉందో ప్రధాని మోడీకి చెప్పారని, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించడం కాంగ్రెస్ సంస్కృతి అని లక్ష్మణ్ దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News