Monday, December 23, 2024

కార్యకర్తలకు అండగా కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలోని గోవిందాపురంకు చెందిన చుట్టగుల్ల సల్లారావు ఇటీవలె కాలంలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదభీమా నుండి మంజూరైన రూ. 2లక్షల చెక్కును గురువారం మృతుని ఇంటివద్దకు కార్యకర్తలతో వెళ్ళి మృతుని కుటుంబ సభ్యులకు ఆమె అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సల్లారావు పార్టీకి చేసినసేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్‌రావు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, గొట్టెముక్కుల రాములు, ఇట్టిమళ్ళ బెంజిమెన్, కంకణాల పుల్లయ్య, దాసరి పున్నయ్య, పాశం కోటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News