Wednesday, January 22, 2025

కాంగ్రెస్ ఇప్పటికీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీయే: తేజస్వీ యాదవ్

- Advertisement -
- Advertisement -

TejaswiYadav

న్యూఢిల్లీ: ప్రతిపక్ష బ్లాక్‌లో నేటికీ కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద పార్టీ అని ఆర్జెడి నాయకుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రాక్టికల్‌గా తమ స్థాయి ఏమిటో ఆలోచించాలన్నారు. ఆయన ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశం నుండి తిరిగొచ్చాక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆమెతో భేటీ అవుతారని తెలిపారు. వారు ఆమెతో 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఎలా ఏర్పాటుచేయాలన్నదానిపై చర్చిస్తారని కూడా తెలిపారు. ప్రతిపక్షాల ఏకైక లక్షం బిజెపిని ఓడించడమే కావాలని తేజస్వీ యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News