Sunday, December 22, 2024

అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణలు… కాంగ్రెస్ పార్టీ నిరసనలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. అదానీ వ్యవహారంపై జెపిసికి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసన తెలియజేసింది. అదానా వ్యవహారంపై ఇడి కార్యాలయం వద్ద కూడా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సెబీ ఛీప్ మాధబీ పురీ బచ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. సెబీ నిబంధనలు ఉల్లంఘించినట్లు మాధబీ పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, యుటిల్లోని ఇడి కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు. గన్‌పార్కు నుంచి ఇడి కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపడుతున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News