Friday, November 22, 2024

ఆరేడు చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

బిజెపిని గెలిపించేందుకు కిషన్‌రెడ్డి
కన్నా సిఎం రేవంత్‌రెడ్డే ఎక్కువ
కష్టపడ్డారు రెండు జాతీయ
పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం
దేశంలో రాబోయేది సంకీర్ణమే
కెసిఆర్ పోరుబాటతో గులాబీదండులో
ఆత్మస్థైర్యం పెరిగింది ఫలితాల
తరువాత రాష్ట్ర కాంగ్రెస్‌కు గడ్డుకాలం
సిరిసిల్లలో బిఆర్‌ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి : లోక్‌సభ ఎ న్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే హవా కా నుందని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సి రిసిల్ల ఎంఎల్‌ఎ కెటిఆర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల క న్నా అత్యధిక పార్లమెంట్ స్థానాల్లో బిఆర్‌ఎస్ గె లిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపిని గెలిపించేందుకు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డికన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే ఎక్కు వ కష్టపడ్డారని ఎద్దేవా చేశారు. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి వంటి ఆరే డు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపి బిజెపి గెలుపునకు సహకారం అందిం చే ప ని చేశారని వ్యాఖ్యానించారు.

దేశంలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్‌డిఏ కూటమి గాని, కాంగ్రెస్ సా రథ్యంలోని ఇండియా కూటమి గాని కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంపూర్ణమైన స్ప ష్టమైన మెజార్టీని సాధిస్తుందని తాము నమ్మ డం లేదన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని అన్నారు. బిజూ జనతాదళ్, బిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి వంటి ప్రాంతీయ పార్టీలే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తాయని తాము బలంగా నమ్ముతున్నామని అన్నారు. నెల రోజుల క్రితం వరకు బిఆర్‌ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాదని ఎద్దేవా చేసిన సిఎం రేవంత్‌రెడ్డితో సహ కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలకు కెసిఆర్ ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు చేపట్టిన 17 రోజుల పోరుబాట, బస్సుయాత్ర వల్ల ముచ్చెమటలు పట్టాయని వ్యాఖ్యానించారు. గులాబీ దండులో ఆత్మ స్థైర్యం పెరిగిందని అన్నారు.

కెసిఆర్ పోరుబాట యాత్ర వల్ల జాతీయ పార్టీల అగ్ర నాయకులు ఇక్కడకు ప్రచారానికి దిగి రాక తప్పలేదన్నారు. కెసిఆర్ పోరుబాటకు జనం బ్రహ్మరథం పట్టారని అన్నారు. రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కెసిఆర్ చేసిన పనులను వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయలేదని ప్రజలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. కరెంట్, నీటి కష్టాలు పెరిగాయని, రైతు బంధు, ధాన్యానికి బోనస్, లక్షా ఆరవై ఏడు వేల మంది మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2500 రూపాయలు రాలేదని, పెన్షన్ పెంచలేదని, తులం బంగారం ఇవ్వలేదని కాంగ్రెస్‌పై మండి పడుతున్నారని అన్నారు.

బిజెపి పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచిందని జనం ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. రైతాంగం, ప్రజలు కెసిఆర్ పాలనే బాగుందనే చర్చ చేస్తున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ రాష్ట్రంలోని 17 ఎంపి సీట్లలో ఉన్న 12 సీట్లలో సామాజిక న్యాయం పాటించి సగం బిసి వర్గాలకు కేటాయించిందని అన్నారు. సీట్ల పంపిణీలో సమతూకం పాటించామని అన్నారు.
కాంగ్రెస్, బిజెపి బిఆర్‌ఎస్ నుండి వచ్చిన పారాచూట్ లీడర్లకు నాలుగైదుచోట్ల టికెట్లు ఇచ్చాయన్నారు. ఒక్క సీటు కూడా బిఆర్‌ఎస్‌కు రాదన్న రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించి 17 పార్లమెంట్ స్థానాల్లో బిఆర్‌ఎస్ దీటైన బలమైన పోటీనిచ్చిందని అన్నారు.

బిజెపి, కాంగ్రెస్ ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ మాదిరిగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఐదు నెలల రేవంత్‌రెడ్డి టైంపాస్ పాలన పట్ల ప్రజలకు అసంతృప్తి కలిగిందని స్వయంగా ఆ పార్టీకి చెందిన 150 మంది నాయకులు తనతో చెప్పారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత తెలంగాణ కాంగ్రెస్‌కు గడ్డు కాలం వస్తుందని జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. తెలంగాణకు బిఆర్‌ఎస్ ఎప్పటికైనా శ్రీరామరక్ష అన్నారు.
ఈ ఏడాదంతా జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలే ఉంటాయని, అందులో బిఆర్‌ఎస్ కార్యకర్తలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు.

పోలీసులు తమ కార్యకర్తలపై, సోషల్ మీడియా నిర్వాహకులపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా లొంగకుండా అభ్యర్థుల గెలుపుకోసం దీటైన ప్రచారం సాగించారని కితాబిచ్చారు.
ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జడ్‌పి సిపి అరుణ, సిరిసిల్ల మున్సిపల్ సిపి జిందం కళచక్రపాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News