Tuesday, January 21, 2025

రెబల్స్పై కాంగ్రెస్ వేటు.. 28 మంది సస్పెండ్

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘పార్టీ వ్యతిరేక’ కార్యకలాపాలకు పాల్పడిన రెబల్స్ పై కాంగ్రెస్ వేటు వేసింది. 28 మంది తిరుగుబాటు అభ్యర్థులను ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో 22 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో సీటు ఆశించారు కొంతమంది నాయకులు. అయితే వారికి టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి అధికారిక అభ్యర్థులపై పోటీకి సిద్ధమయ్యారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆ నేతలను సస్పెండ్ చేసింది.

ఏఐసీసీ ఇన్‌చార్జి రమేష్ చెన్నితాల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. MVA అధికారిక అభ్యర్థులపై తిరుగుబాటుదారులు ఎవరైనా పోటీ చేస్తే ఆరేళ్లపాటు సస్పెన్షన్‌కు గురవుతామని గతంలో చెన్నితాల హెచ్చరించారు. సస్పెండ్ అయిన వారిలో రామ్‌టెక్ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి రాజేంద్ర ములక్, కటోల్ నుండి యాజ్ఞవల్క్ జిచ్కర్, కస్బా నుండి కమల్ వ్యావరే, కోప్రి పచ్చడి నుండి మనోజ్ షిండే, పార్వతి నుండి ఆబా బగుల్ వంటి ప్రముఖ నేతలు సస్పెండ్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News