Monday, January 20, 2025

రూ. 500కే గ్యాసు బండ: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ హామీల వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం మధ్యప్రదేశ్‌లో ఎన్నికల సమరసంఖాన్ని పూరించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 500కే వంటగ్యాసు సిలిండర్‌ను అందచేస్తామని, నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందచేస్తామని మధ్యప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వరాల జల్లు కురిపించారు.

త్వరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ సోమవారం నాడిక్కడ ఒక ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగం, రైతుల కష్టాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే బాధ్యతని ఆమె ఆరోపించారు.
గత మూడేళ్లలో మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం కేవలం 21 ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని ఆమె తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నుకున్నప్పటికీ కుటిల రాజకీయాలతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆమె ఆరోపించారు.

బిజెపి పాలనలో రాష్ట్రంలోఅవినీతి పెచ్చుమీరిపోయిందని, ప్రధాని నరేంద్ర మోడీ వల్లెవేసిన తిట్ల దండకంతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో బిజెపి సాగించిన అవినీతి, కుంభకోణాల జాబితా చాలా పెద్దదని ఆమె వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం నేర్పారని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News