Thursday, January 23, 2025

చివరి రౌండ్ చర్చల తర్వాతే కాంగ్రెస్ నవ సంకల్ప్ ప్రకటన ఆమోదం

- Advertisement -
- Advertisement -

 

Chintan Shivir

జైపూర్:  ఉదయపూర్‌లో కాంగ్రెస్ మూడు రోజుల ‘చింతన్ శివిర్’ ఆదివారంతో ముగియనుండడంతో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేక సంస్థాగత సంస్కరణలు,అనేక కీలక అంశాలపై పార్టీ వైఖరిని నిర్దేశిస్తూ ‘నవ్ సంకల్ప్’ ప్రకటనను ఆమోదించాలని భావిస్తోంది. చివరి రౌండ్ చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి, వివిధ ప్యానెల్లు తమ నివేదికలను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించాయి,  తుది ఆమోదం కోసం అవి సిడబ్య్లుసికి ఇవ్వబడతాయి. సిడబ్య్లుసి సమావేశానికి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, పి చిదంబరం, ప్రియాంక గాంధీ వాద్రా సహా కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. వరుస ఎన్నికల పరాజయాల తర్వాత, ‘చింతన్ శివిర్’ పార్టీ పునర్నిర్మాణంపై ఆలోచనలు చేయడానికి, తదుపరి ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి మార్గాలను కనుగొనడానికి,  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉద్దేశించబడింది.

అన్ని స్థాయిలలో సంస్థలో పదవులు నిర్వహించేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాయకులకు వయోపరిమితి విధించడం, రాజ్యసభ సభ్యులకు పదవీకాల పరిమితిని విధించడం, “ఒకే కుటుంబం, ఒకే ఎన్నికల టిక్కెట్” నిబంధనను అమలు చేయడం, ఐదేళ్ల పదవీకాలం తర్వాత ఏఐసిసి  ప్రధాన కార్యదర్శులతో సహా అన్ని స్థాయిల్లోని ఆఫీస్ బేరర్లకు మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ వంటివి సూచించబడ్డాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచే అన్ని స్థాయిల్లో 50 ఏళ్ల లోపు వారికి 50 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ యోచిస్తోంది.
చింతన్ శివిర్‌లో  చివరి రోజున, బిజెపి హిందుత్వ ఆధారిత రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలనే ప్రశ్నను పార్టీ నాయకులు ప్రస్తావించారు. రాజకీయ సవాళ్ల కమిటీలో చర్చలు నిష్కపటంగా జరిగాయి, కొన్నిసార్లు వేడెక్కాయి కూడా. కమిటీ నివేదికలో హిందూ లేదా హిందుత్వ ప్రస్తావన చేయాలా అనే దానిపై కూడా చాలా ఊగిసలాట చోటుచేసుకుంది.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News