Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను సక్సెస్ చేయాలని కార్యకర్తలు, ప్రజలకు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు గాంధీభవన్ లో జాతీయ పతాకం ఆవిష్కరణ ఉంటుందన్నారు. 11.00 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరులకు లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పిస్తారన్నారు.

అనంతరం నిజాం కాలేజ్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుందని, గన్ ఫౌండ్రి, అబిడ్స్ నెహ్రు విగ్రహం, మొహంజాహి మార్కెట్ మీదుగా గాంధీభవన్‌కు చేరుకుంటుందన్నారు. తర్వాత ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని మహేష్‌గౌడ్ స్పష్టం చేశారు. ఎఐసిసి ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే, ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. మరో వైపు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీ లక పాత్ర పోషించిన ముఖ్యులకు సన్మానం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News