Thursday, January 2, 2025

హర్యానాలో కాంగ్రెస్ ఒంటరి పోరు

- Advertisement -
- Advertisement -

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడ పార్టీ నేత కుమారి సెల్జా తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందని, సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుందని వెల్లడించారు. లోక్‌సభ ఎంపి, దళిత నేత అయిన సెల్జా ఈసారి హర్యానాలో కాంగ్రెస్ తరఫున సిఎం అభ్యర్థి అవుతారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడారు. 90 మంది సభ్యుల అసెంబ్లీలో తమ పార్టీకి అత్యద్భుత మెజార్టీ వస్తుందని, హంగ్ అవకాశాలు లేనేలేవని కొట్టిపారేశారు.

రాష్ట్రంలో జననాయక్ జనతాపార్టీ (జెజెపి) కి హర్యానాలో మంచి పలుకుబడి ఉందని, అయితే ఈ పార్టీలో చీలికలు తలెత్తుతున్నాయని, దీనితో ఎన్నికల్లో సత్ఫలితాలకు చాన్స్ లేదన్నారు. సెల్జా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా , ఇంతకు ముందు హర్యానా పిసిసి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఇక ఐఎన్‌ఎల్‌డి బిఎస్‌పి కూటమితో ఒరిగేదేమీ లేదని, ఈ పార్టీలకు రాష్ట్రంలో పట్టు పోయిందని వ్యాఖ్యానించారు. ఈ కూటమిని తాము పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఆదరణ ఉందని వివరించారు. ఈ పార్టీలకు గత లోక్‌సభ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువరించింది. దీనితో రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News