Monday, January 20, 2025

కాంగ్రెస్ కీలక భేటీకి 100 మంది డుమ్మా

- Advertisement -
- Advertisement -

పిసిసి ప్రధాన కార్యదర్శుల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మండిపడ్డారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో పిసిసి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో ఠాక్రే మాట్లాడుతూ వంద మంది ప్రధా న కార్యదర్శులు ఉంటే ఏ ఒక్కరూ సమావేశానికి రాలేదన్నా రు. ఇది మంచి పద్ధతి కాదని, ఇలా సమావేశానికి గైర్హాజరైతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. సమావేశానికి రాని, అప్పగించిన బాధ్యతలు నేరవేర్చని నేతలను తొలగిస్తామని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి ఎవరూ ఇప్పటివరకు నివేదిక లు ఇవ్వకపోవడంతో ఠాక్రేతో పాటు ఎఐసిసి కార్యదర్శి బో సురాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పార్టీ తీసుకోవాల్సిన చర్యలు, యాక్షన్‌ప్లాన్లు, ప్రభుత్వంపై పోరాడాల్సిన వి ధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చ ర్చించారు. కార్యక్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కార్యదర్శులు బోసురాజు, నదీమ్ జావిద్, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, ఎంఎల్‌ఎలు సీతక్క, పొ డెం వీరయ్య, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, చామల కిరణ్ రెడ్డి, హర్కర వేణు గోపాల్, వేం నరేందర్ రెడ్డి, కొండా సురేఖ, నాగం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

ఇక నుంచి పార్టీ మీటింగ్‌లు, కార్యక్రమాలకు ఐదు సార్లు రాకపోతే పార్టీ నుంచి చర్యలు ఉంటాయన్నారు. కార్యకర్తల నుంచి లీడర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందన్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను అత్యంత బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.

రేవంత్ రెడ్డి 30 నియోజక వర్గాలలో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర విజయవంతంగా నిర్వహించారని అభినందించారు. ఎఐసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు అన్ని విభాగాల మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజయవంతంగా కార్యక్రమాలు చేశారన్నారు. ఇంటింటికి రాహుల్ గాంధీ సందేశాన్ని అందించారన్నారు. మోడీ, బిజెపి చేస్తున్న మత విద్వేషాలు ప్రజలకు వివరించారన్నారు. బిజెపి చేస్తున్న అవినీతిని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంటే మోడీ భయపడుతున్నారన్నారు. అందుకే అనర్హత వేటు వేశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు కాంగ్రెస్ ఎప్పటికీ భయపడదన్నారు.
జంగా రాఘవ రెడ్డికి పిసిసి క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు, 24 గంటల డెడ్‌లైన్
జనగామ జిల్లా మాజీ డిసిసి అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి పిసిసి క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. పిసిసి విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డిలు డుమ్మాకొట్టారు. దీంతో పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇకపోతే జంగా రాఘవరెడ్డి తీరుపై హన్మకొండ డిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగంగా విమర్శలు గుప్పించడం ఇటీవల కలకలం రేగింది. జనగామ జిల్లాకు రాఘవరెడ్డి డిసిసి అధ్యక్షుడు కాదని విపక్షాలకు లాభం కలిగిలా జంగా పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు.

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్ భాస్యర్‌తో కలిసి తనకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు అతికించా డని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా హన్మకొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, తనకే టికెట్ వస్తుందని అంటున్నాడని జంగాపై రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ జంగాపై ఫిర్యాదు చేశామని, ఆయనకు పార్టీ పెద్దలు షోకాజ్ నోటీ సులు కూడా ఇచ్చారని నాయిని గుర్తుచేస్తున్నారు. ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని, జంగా ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నామని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. తీర్మానం కాపీని అధిష్టానానికి పంపించామని అక్కడి స్పందనను బట్టి , తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News