Sunday, December 22, 2024

తెలంగాణలో రాహుల్‌ గాంధీ బస్సు యాత్ర!

- Advertisement -
- Advertisement -

ఈ నెల 15వ తేదీ తర్వాత కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం
19 నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్రలో పాల్గొననున్న రాహుల్‌గాంధీ
సోనియా, ప్రియాంకలు సైతం బస్సు యాత్రకు హాజరయ్యే అవకాశం
హైదరాబాద్: రానున్న ఎన్నికలకు టీ కాంగ్రెస్ సిద్దమవుతోంది. ఇప్పటికే పాదయాత్ర, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ త్వరలో బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. ఈ నెల 15వ తేదీ తర్వాత బస్సు యాత్ర ప్రారంభం కానుండగా జాతీయ కాంగ్రెస్ అగ్రనేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఉత్తర తెలంగాణలో జరిగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ హాజరు కావడంతో పాటు ఈ నెల 19, 20, 21వ తేదీల్లో మూడు రోజుల పాటు ఈ బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొననున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ బస్సు యాత్ర ద్వారా తెలంగాణలో ప్రచారం చేయనున్నారు.

అలాగే సోనియాగాంధీ, ప్రియాక గాంధీ కూడా బస్సు యాత్రలో పాల్గొనేలా టి కాంగ్రెస్ వర్గాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల మీదుగా ఈ బస్సు యాత్రకు రూట్‌మ్యాప్‌ను టి కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. బస్సు యాత్రలో భాగంగా పలుచోట్ల కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. టి కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ ఈ యాత్రలో పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ నేతలు ఆ దిశగా కృషి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News