Monday, December 23, 2024

150 రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : మరో 150 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని అక్రమార్కులు జైలుకు వెళ్లడం ఖాయమని టీపీసీసీ చైర్మైన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్యనాయక్ అన్నారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడుతూ వందలాది ఎకరాలను కొల్లకొట్టారని ఆరోపించారు.

మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ మాలోతు కవితలు కూడా కొందరు రెవెన్యూ అధికారులను అండతో ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా పట్టాలు సృష్టించి వారు ప్లాట్లు చేసి ఎధేచ్చగా విక్రయాలు జరుపుతూ కోట్లు గడించిన విషయాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అక్రమాలకు ఊతమిచ్చిన రెవెన్యూ అధికారులతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. నెల్లికుదురు జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ భూములను పట్టాలుగా చేసుకుని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్న పరిస్థితి మానుకోట పట్టణంలో ఉందన్నారు.

ఈ మేరకు మానుకోటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు కలెక్టర్‌కు పీర్యాదు చేశారని వెల్లడించారు. ఈ పీర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆ భూమిని కాపాడాల్సిన బాద్యత ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. మానుకోట పట్టణంలో పేదలు వేసుకుంటున్న గుడిసెలను ఎమ్మెల్యే ఎంపీల బలంతోనే అధికారులు తొలగిస్తున్నారని ఆరోపించారు. గుడిసెవాసులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలు వేసుకున్న గుడిసెల స్థానంలోనే పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా అందిస్తామని వెల్లడించారు.

గుడిసెవాసులపై జులూం వహించే అధికారులు, రాజకీయ నాయకలు కబ్జాలకు పాల్పడుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు గుగులోతు వెంకట్‌నాయక్, ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, పి.గుట్టయ్యగౌడ్ సురేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News