Monday, November 18, 2024

5న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

- Advertisement -
- Advertisement -

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ నెల 5న విడుదల చేయనున్నది. ఆ మరునాడు పార్టీ అగ్ర నేతలు జైపూర్, హైదరాబాద్‌లలో మెగా ర్యాలీలలో ప్రసంగించనున్నారు. ‘దేశ వ్యాప్తంగాప్రజలతో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ ఈ నెల 5ప తమ లక్ష పత్రం లేదా మేనిఫెస్టోను ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో విడుదల చేయనున్నది.అటు పిమ్మట 6నజైపూర్, హైదరాబాద్‌లలో రెండు మెగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం’ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. జైపూర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,

ప్రియాంక గాంధీ వాద్రా మేనిఫెస్టో విడుదల చేసి మెగా ర్యాలీలో ప్రసంగిస్తారని ఆయన తెలిపారు. ‘హైదరాబాద్‌లో మేనిఫెస్టో విడుదలకు ముందు రాహుల్‌జీ మెగా ర్యాలీలో ప్రసంగిస్తారు. దేశానికి సంక్షేమ ప్రాధాన్యం ఉన్న, అభివృద్ధి అనుకూల లక్షాన్ని నిర్దేశించడంపై మా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. దానిని ఈ ఎన్నికల కోసం ప్రజల ముందు ఉంచుతాం’ అని వేణుగోపాల్ తెలియజేశారు. పార్టీ మేనిఫెస్టో ఐదు న్యాయాలు& యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్‌పై దృష్టి కేంద్రీకరిస్తుంది. కాంగ్రెస్ తమ ‘ఘర్ ఘర్ గ్యారంటీ’ ప్రచారాన్ని బుధవారం (3న) ప్రారంభిస్తుంది. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల పైగా కుటుంబాల వద్దకు పార్టీ నేతలు వెళతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News