Monday, December 23, 2024

మజ్లిస్‌తో దోస్తీ కట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో భారీ మెజార్టీ చూపించుకునేందుకు మజ్లిస్‌తో దోస్తీ కట్టేందుకు ప్రయత్నాలు వేగంగా చేస్తుందని రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. సభలో అక్బరుద్దీన్ కంటే ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ అతడిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడంపై అగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో స్పల్ప మెజార్టీతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీని మచ్చిక చేసుకోవడానికే ప్రొటెం స్పీకర్ పదవి కట్టబెట్టిందని ఆరోపించారు. సీనియారిటీని కాదని ఎంఐఎం ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా చేసిందని మండిపడ్డారు. అందుకే తమ పార్టీ ప్రొటెం స్పీకర్ ఎంపికను వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్ సెలక్షన్ విషయంలో పూర్తిగా రాజకీయం ఉందని, ప్రభుత్వం ఎవరి పేరు పంపితే వారినే గవర్నర్ ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని స్పష్టత ఇచ్చారు. విచ్ఛిన్నకర రాజకీయాలకు అడ్రస్‌గా కాంగ్రెస్ పార్టీ ఉందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మా సభ్యులు తమ గొంతు బలంగా వినిపిస్తామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News